VSP: విశాఖలోని 49వ వార్డు అయ్యప్ప నగర్లో ప్రేమ్ కుమార్, మేరీ దంపతుల ఆధ్వర్యంలో గురువారం రాత్రి క్రిస్మస్ ఆరాధన వేడుకలు వైభవంగా జరిగాయి. సత్య సంస్థాపక సహవాసం పర్యవేక్షణలో క్రైస్తవ సోదరులు భక్తి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ వై. ఆంద్రేయ దేవుని వాక్యాన్ని వినిపించగా, భక్తులు భక్తిశ్రద్ధలతో క్యాండిల్ సర్వీస్ నిర్వహించారు.