NLG: టాంజానియా దేశంలో తెలంగాణ వాసి మృతి చెందాడు. మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన బడుగు రాజు (38) టాంజానియాలో గుండెపోటుతో మరణించాడు. రాజధాని దారుసలాంలో రాజు జియాలాజిస్ట్ పనిచేస్తున్నాడు. కాగా, గురువారం విధులు హాజరైన రాజుకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కన్నుమూశారు. ఈ విషయాన్ని రాజు కొలీగ్స్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు.