KRNL: ఆదోని నియోజకవర్గం ఆరెకల్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోలేని సూర్యనారాయణ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించి ఆరోగ్య భద్రతపై అవగాహన కల్పించగా గ్రామస్థుల నుంచి మంచి స్పందన లభించింది.