అన్నమయ్య: చిట్వేల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మారటిపల్లి గ్రామానికి చెందిన వలసాని గోపాల్ డెలివరీ టేబుల్‌ను విరాళంగా గురువారం అందించారు. 2019 నుంచి గర్భిణీలకు తాగునీరు, అల్పాహారం అందిస్తూ, కరోనా సమయంలో సిరంజీలు, మాస్కులు, శానిటేషన్ సామగ్రిని కూడా విరాళంగా ఇచ్చారు. ఆసుపత్రి అభివృద్ధికి ఆయన నిరంతరం సహకరిస్తున్నారని డాక్టర్ అన్సారీ ప్రశంసించి కృతజ్ఞతలు తెలిపారు.