NGKL: స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో ఈ నెల 21 నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా సన్నాహక సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా దమ్ము ఉపనిషద్వాణి, ఛైర్మన్ కమ్ జూనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవా అధికార సంఘం, కొల్లాపూర్ హాజరై లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని కోరారు.