CTR: పలమనేరు పట్టణం ST కాలనీకీ చెందిన తెలుగుదేశం పార్టీ 14వ వార్డు అధ్యక్షులు డిష్ శేఖర్ కుటుంబీకులను ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. శేఖర్ తల్లి శాంతమ్మ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో విషయం తెలుసుకున్న ఆయన పట్టణ టీడీపీ నాయకులతో కలసి వెళ్ళి ఆమె భౌతికకాయానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.