KNR: మొంథా ప్రభావంతో నష్టపోయిన రైతులకు ఎకరానికి 50వేల పరిహారం చెల్లించాలని, జాగృతి అధ్యక్షరాలు కవిత డిమాండ్ చేశారు. తిమ్మాపూర్ మండలం నల్గొండలో ఆమె ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం తడిసినా, మొలకెత్తినా, బూజు పట్టినా ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. కోతలు ప్రారంభమై నెల కావస్తుందన్నారు.