TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఖచ్చితంగా గెలుస్తారని ఆయన నొక్కి చెప్పారు. ఈ క్రమంలో కాంగ్రెస్, BJPలపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.