MDK: వర్షాలకు తడిసిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలు చేయాలని అఖిలభారత కిసాన్ సంఘం డిమాండ్ చేసింది. శుక్రవారం చేగుంట తహసిల్దార్ శివప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. ఐకెపి ఆధ్వర్యంలో వెంటనే ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలన్నారు. సన్న రకాలకు రూ. 500 బోనస్ చెల్లింపు చేపట్టాలని డిమాండ్ చేశారు.