HYD: జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్లోని పలు కాలనీల్లో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసి, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఓటు వేసి గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.