SKLM: సరుబుజ్జిలి మండలం దన్నాన పేట సమీపంలో ఓ కాలేజీ బస్సు గురువారం రాత్రి బోల్తాపడింది. పర్లాకిమిడి నుంచి శ్రీకాకుళం వెళ్తున్న బస్సు రోడ్డు పై ఉన్న గుంతను డ్రైవర్ తప్పించాడు. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లో బోల్తా పడింది. పది మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం తప్పడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.