ADB: గాదిగూడ మండల కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఎస్పై ప్రణయ్ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి KGBV పాఠశాల వరకు విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కోసం స్మారక 2KM రన్ నిర్వహించారు. ఇందులో హాజరైన విద్యార్థులకు పోలీసుల సేవలపై అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో 100కు సంప్రదించాలని పేర్కొన్నారు.