NLG: నల్గొండ మండలం ఖాజీ రామారం ఎస్సీ కాలనీలో ఎంఆర్ పరుశరాములు ఆధ్వర్యంలో ‘పౌర హక్కుల దినోత్సవం’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో మాట్లాడారు. కుల వివక్షత, అంటరానితనం, సమాజంలో చిన్నచూపు వంటి అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆరి గౌస్ బాబా, జీపీవో లచ్చయ్య, పంచాయతీ సెక్రెటరీ రాజేశ్వరి పాల్గొన్నారు.