AP: రిటైరైన RTC ఉద్యోగులకు కూడా EHS వర్తింపజేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే 2020 జనవరి 1 తర్వాత పదవి విరమణ చేసినవారికే ఇది వర్తిస్తుంది. ఈ మేరకు సూపరింటెండెంట్ కేటగిరీ వరకు రూ.38,572, అసిస్టెంట్ మేనేజర్, ఆపై ర్యాంకువారు రూ.51,429లను ప్రీమియంగా ఒకసారి చెల్లిస్తే చాలు.. జీవితాంతం(భాగస్వామి కూడా) ఉచిత వైద్యం పొందవచ్చు.