NLR: చేజర్ల మండలం నాగులవెల్లటూరులో వ్యవసాయ అధికారి హిమబిందు ఆధ్వర్యంలో యూరియా పంపిణీ చేపట్టారు. సోమశిల ప్రాజెక్టు ఛైర్మన్ వేలూరు కేశవ చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతులకు సమయానికి ఎరువులు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. హిమబిందు మాట్లాడుతూ.. పంటల అభివృద్ధికి సరైన ఎరువుల వినియోగం ఎంతో కీలకమని సూచించారు.