ADB: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడులను రద్దుచేసి పాత చట్టాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని AITUC జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఏఐటీయూసీ 106 వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జెండావిష్కరణ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని పిలుపునిచ్చారు.