SRPT: కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని అనంతగిరి నూతన ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు శుక్రవారం రాత్రి కోదాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షుడు గుడిమెట్ల రామకృష్ణ,ప్రధాన కార్యదర్శి ఇరుగు వెంకటేశ్వర్లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేను కోరారు.