NDL: నంద్యాల పట్టణంలో పోలీసులు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో జిల్లా ఎస్పీ సునీల్ పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్థాన వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీనివాస్ సెంటర్ నుంచి గాంధీ చౌక్ వరకు పోలీసులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అమరులైన పోలీసులకు జిల్లా ఎస్పీ సునీల్, అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు కలిసి నివాళులర్పించారు.