NZB: ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో పక్కాగా నిర్వహించాల్సిందేనని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టీ. వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించే వారిని ఎంత మాత్రం ఉపేక్షించబోమన్నారు. బాధ్యులపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.