NRPT: మద్దూరు మండల పరిధిలోని హనుమాన్ నాయక్ తండాలో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను ఎంపీడీవో శ్రీధర్ శుక్రవారం తనిఖీ చేశారు. బేస్మెంట్ స్థాయిలో ఉన్న ఇళ్లను కూడా పరిశీలించి, వాటిని వెంటనే పూర్తి చేయాలని లబ్ధిదారులను ఆయన కోరారు. ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఎంపీడీవో సిబ్బందికి ఆయన సూచించారు.