ADB: జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం వందశాతం సాధించేలా సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజార్షి షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి కళాశాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంపై దృష్టి సారించాలని సూచించారు.