కృష్ణా: కోడూరు మండలం మందపాకల-వక్కపట్లవారిపాలెం ప్రధాన పంట కాలువలో పోటుమీద గ్రామం వద్ద శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం చెత్త మధ్య చిక్కుకొని కనిపించింది. మృతుడి వయస్సు సుమారు 35 ఏళ్లు ఉంటుందని పోలీసుల అంచనా వేశారు. మృతుడి ఒంటిపై బ్లాక్ టీషర్ట్, గ్రీన్ షార్ట్ ధరించి ఉంది. మృతుడి వివరాలు తెలిసిన వారు కోడూరు పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు కోరారు.