JGL: గొల్లపల్లి మండలం చిల్వ కోడూరు గ్రామానికి చెందిన అల్లాడి ప్రభాకర్, అనురాధ దంపతుల కుమారుడు రుద్రాంశ్ (3) బోన్ మ్యారో వ్యాధితో బాధపడుతుండగా, వైద్యానికి రూ. 1.61 లక్షల సాయం లభించింది. ధర్మపురికి చెందిన రేణికుంట రమేష్ ఫేస్ బుక్లో పోస్ట్ చేయగా ఎన్నారైలు, దాతలు స్పందించి సాయం చేశారు. జగిత్యాల టౌన్ సీఐ కరుణాకర్, ఎస్సై రవికిరణ్ చేతుల మీదుగా సాయం అందజేశారు.