ATP: పోలీసుల అమర వీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా గురువారం గుత్తి పోలీస్ స్టేషన్లో ఓపెన్ పోలీస్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై సురేష్ బాబు విద్యార్థులకు పోలీసులు వినియోగించే పరికరాలు, ఆయుధాల వినియోగం తదితర అంశాల గురించి వివరించారు. అదేవిధంగా పోలీసుల విధులు, ఎఫ్ఎఆర్ నమోదు, విద్యార్థి అంశాల పట్ల అవగాహన కల్పించారు.