ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో విజేతకు దక్కే ప్రైజ్‌మనీ భారీగా పెరిగింది. గతంలో విజేతకు అందిన రూ. 31 కోట్ల మొత్తాన్ని ఇప్పుడు రూ. 40 కోట్లకు పెంచారు. అంతేకాకుండా, ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచిన జట్టు రూ. 20 కోట్లు అందుకోనుంది. అలాగే, సెమీఫైనల్స్‌కు చేరుకున్న జట్లకు కూడా రూ. 10 కోట్లు చొప్పున ప్రైజ్‌మనీ దక్కనుంది.