మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని 48.3 ఓవర్లలో ఛేదించింది. WC చరిత్రలో నాకౌట్ మ్యాచ్‌లలో ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించింన మొదటి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్ (115*), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(89) పరుగులతో రాణించి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించారు.