మహిళల వన్డే WC ఫైనల్‌కు భారత్ అర్హత సాధించింది. సెమీఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మ్యాచ్‌లో 339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 48.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. జెమీమా రోడ్రిగ్స్(127*), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(89) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ, శ్రీ చరణి తలో రెండు వికెట్లు పడగొట్టారు.