NZB :ఏర్గట్ల మండల కేంద్రంలో ఎస్సై పడాల రాజేశ్వర్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల స్మరణ వారోత్సవాల సందర్భంగా గురువారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి శివాజీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. గ్రామస్తులు, యువకులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొని కొవ్వొత్తులు వెలిగించి అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.