E.G: తుఫాన్ కారణంగా ఏజెన్సీ ప్రాంతాలకు రద్దైన ఆర్టీసీ బస్సు సర్వీసుల గురువారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించడం జరిగినట్లు గోకవరం ఆర్టీసీ డిపో మేనేజర్ సుచరిత తెలిపారు. రంపచోడవరం మారేడుమిల్లి, ఘాటి మీదగా వెళ్లే భద్రాచలం, చింతూరు, కూనవరం బస్ సర్వీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం ఉదయం ప్రారంభించడం జరిగిందన్నారు.