బాలీవుడ్ డైరెక్టర్ నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’లో రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా నటించడంపై ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈశా ఫౌండేషన్ ఫౌండర్ సద్గురు జగ్గీ వాసుదేవ్ ఈ ట్రోల్స్ అన్యాయమని, ఇది సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. గతంలో చేసిన పాత్రల ఆధారంగా అతను ఈ పాత్ర చేయకూడదనడం తగదన్నారు. అలాగే రణ్బీర్ ఎంపికను సమర్థించారు.