KDP: కాజీపేట మండలం తిప్పాయపల్లెకు చెందిన మల్లయ్య జీవనోపాధిగా గొర్రెలు మేపుతూ జీవనం సాగిస్తున్నారు. తిప్పాయపల్లె నుంచి కమలాపురం మండలం ఎర్రవల్లి కొత్తపల్లికు గొర్రెలు మేపుకోవడానికి వెళ్లారు. కుక్కల దాడిలో మల్లయ్యకు చెందిన 15 గొర్రెలు మృతి చెందాయి. మరి కొన్నింటికి గాయాలు కావడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. దాదాపు లక్ష 50 వేల రూపాయలు నష్టం వాటిల్లింది.