‘కాంతార 1’తో మంచి హిట్ అందుకున్న కన్నడ స్టార్ రిషబ్ శెట్టి మరో తెలుగు సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ‘ఆకాశవాణి’ ఫేమ్ అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఆయన నటించనున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించనున్నట్లు సమాచారం. ఇక పీరియాడిక్ కథాంశంతో రాబోతున్న ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.