అనంతపురం నగరంలోని 12వ డివిజన్‌కు చెందిన టీడీపీ కార్యకర్త మదన్ మోహన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన కుటుంబానికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రూ. 5 లక్షల ప్రమాద బీమా పత్రాన్ని అందజేశారు. కేవలం రూ. 200 చెల్లిస్తే రూ. 5 లక్షల బీమా కల్పించిన ఏకైక పార్టీ టీడీపీ అని ఆయన తెలిపారు. కార్యకర్త కుటుంబానికి కష్టం వస్తే పార్టీ అండగా ఉంటుందన్నారు.