మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ ముందు ఆస్ట్రేలియా 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. WC చరిత్రలో నాకౌట్ మ్యాచ్లలో ఇంత భారీ లక్ష్యాన్ని ఇప్పటివరకు ఏ జట్టు ఛేదించలేదు. ఈ నేపథ్యంలో, టీమిండియా ఈ లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టిస్తుందా లేదా అనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే భారత జట్టు ఆశలన్నీ స్మృతి మంధానపైనే ఆధారపడి ఉన్నాయి.