CTR: మాజీ మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో శుక్రవారం తుది తీర్పు వెలువడనుండటంతో నగరంలో 144 సెక్షన్ అమలులో ఉందని చిత్తూరు సబ్-డివిజన్ డీఎస్పీ టి. సాయినాథ్ ప్రకటించారు. గుంపులుగా చేరడం, సంబరాలు లేదా ర్యాలీలు నిర్వహించడం నిషేధమన్నారు. శాంతి భద్రతలకు సహకరించాలని, సోషల్ మీడియా ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు.