ADB: ఆదిలాబాద్ వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం జరిగిన నవజాత శిశు సంరక్షణ శిక్షణ ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణలో ప్రతిభ చూపిన వైద్యులు, సిబ్బందికి ఆయన ప్రశంసాపత్రాలు, మెమొంటోలను అందజేశారు. శిశు మరణాల నివారణకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.