KMM: కొనిజర్ల మండలం అంజనాపురం గ్రామం సమీపంలో నిమ్మ వాగు వరద నీటిలో కొట్టుకుపోయిన డీసీఎం వ్యాన్ ఆచూకీ లభ్యమైంది. వరద నీరు తగ్గిపోవడంతో వాగులో డీసీఎం వ్యాన్ బయపడింది. పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో క్రేన్ల ద్వారా డీసీఎం వ్యాన్ను బయటకు తీయించారు. డ్రైవర్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.