E.G: కానూరు-ఉసులుమర్రు గ్రామాల మధ్య రూ.3 కోట్లతో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు.శుక్రవారం ఈ రోడ్డును ఆయన పరిశీలించారు. ఇప్పటికే నిధులు మంజూరు అయ్యాయని, మరో రెండు రోజుల్లో పనులు మొదలు పెట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అలాగే వడ్లూరు-తీపర్రు రోడ్డుకు రూ.3.24 కోట్లు మంజూరు చేయించామని మంత్రి తెలిపారు.