ATP: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి అకడమిక్ కన్సల్టెంట్ల నియామకానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఆచార్య ఆంజనేయులు తెలిపారు. నవంబర్ 3న బయోటెక్నాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, హిందీ తదితర విభాగాల్లో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.