KMM: వేంసూరు మండలానికి చెందిన లబ్ధిదారులకు గురువారం సత్తుపల్లి MLA క్యాంప్ కార్యాలయంలో 25,02,900 రూపాయలు విలువ గల కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి పథకాలు లబ్ధిదారులకు అందజేయాలనే ఉద్దేశంతో పని చేస్తున్నారని ఎమ్మెల్యే రాగమయి తెలిపారు. మరిన్ని అభివృద్ధి పథకాలు చేస్తామన్నారు.