BDK: మొంథా తుఫాను కారణంగా జిల్లాలో ప్రాథమిక అంచనా ప్రకారం.. 1,452 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం తెలిపారు. 33 గ్రామాల్లోని 734 మంది రైతులకు నష్టం వాటిల్లిందని వెల్లడించారు. ఇల్లందు 426, టేకులపల్లి 350, అశ్వరావుపేట 308, చుంచుపల్లి 275, ములకలపల్లి 45, చర్ల 33, అత్యల్పంగా సుజాతనగర్ 15 నష్టం జరిగిందని తెలిపారు.