KNR: భారీ వర్షాలకు పంట నష్టపోయి కన్నీరుమున్నీరైన హుస్నాబాద్ నియోజకవర్గం పోతారం గ్రామానికి చెందిన రైతు తారవ్వకు కేంద్ర మంత్రి బండి సంజయ్ అండగా నిలిచారు. ఢిల్లీ నుంచి ఆమెకు ఫోన్ చేసి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. తక్షణ సాయంగా రూ” 50 వేలు పంపిస్తున్నట్లు ఓ ప్రకటించారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.