HYD: సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు గమనించి తీవ్ర గాయాలైన ఆ వ్యక్తిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.