NLG: జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ యాదవ సంఘం భవన్లో ఇవాళ యాదవుల సదర్ ఉత్సవ సమితి అధ్యక్షులు మద్ది శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సదర్ సమ్మేళనం (నవంబర్ 2)పోస్టర్ను ఘనంగా ఆవిష్కరించారు. సదర్ పండుగలో దున్నపోతుల అలంకరణ, కుస్తీ పోటీలు యాదవుల సాంప్రదాయానికి ప్రతీకగా నిర్వహిస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజలు, యువత పెద్ద ఎత్తున హాజరై సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.