TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వరంగల్, హుస్నాబాద్ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న, పంట నష్టం వాటిల్లిన ప్రాంతాలను పరిశీలిస్తారు. నిన్న ఉదయమే వెళ్లేందుకు రేవంత్ సిద్ధపడ్డారు. కాగా, చివరి నిమిషంలో పర్యటన రద్దయింది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఏరియల్ సర్వేకు అధికారులు అనుమతించలేదు.