ATP: నార్పల మండలం గూగూడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త రాజన్న రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి శుక్రవారం అతడికి నివాళులర్పించారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద ఉన్న రాజన్న భౌతికదేహానికి పూలమాల వేసి ఆమె నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.