జీసస్ వల్లే విజయం సాధ్యమైందని.. ఆయనే తనను నడిపించాడని టీమిండియా మహిళా బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ తెలిపింది. నిన్న సెమీస్-2లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో జెమీమా 134 బంతుల్లో 127 నాటౌట్‌గా నిలిచి.. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ అద్భుత శతకంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన జెమీమా.. హోస్ట్‌తో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమైంది.