GNTR: భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లబాయ్ పటేల్ ఆశయ సాధనకు కృషి చేయాలని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ డి.ఆశీర్వాదం అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా శుక్రవారం మంగళగిరి ఏపీ ఎస్పీ 6వ బెటాలియన్లో ఏక్తా దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.