SRD: జోగిపేట పట్టణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘ఏక్తా దివస్’ ర్యాలీని శుక్రవారం నిర్వహించారు. బస్టాండ్ నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా స్థానిక సీఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. పటేల్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని అన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు.