BDK: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శుక్రవారం సందర్శించారు. అన్నపరెడ్డిపల్లి మండలం ఎర్రగుంట, జానికిపురం, రంగాపురం గ్రామలలో పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగే పనులను గమనించిన ఆయన నాణ్యతగా వేగంగా పనులు కొనసాగించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.